CM KCR: హుజూరాబాద్‌కు 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా దళితబంధు
CM KCR: భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR: భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళితబంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని, కానీ, కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని కేసీఆర్ అన్నారు.
రైతు బంధు తరహాలో దళిత బంధు కూడా అందరికీ వర్తింస్తుందని ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్నవారికి రైతు బంధు వచ్చినట్టే ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుందని వెల్లడించారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని, దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలున్నాయని తెలిపారు. హుజురాబాద్‌లో వచ్చేనెల, రెండు నెలల్లో అందరికీ దళితబంధు వస్తుందని చెప్పారు.