CM KCR: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్

CM KCR: ఈ వారంలో ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ వెళ్లే ఛాన్స్

Update: 2022-02-24 02:16 GMT

జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్

CM KCR: జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ హస్తిన వేదికగా పావులు కలిపేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వారం రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు రోజులపాటు అక్కడే ఉండి కలిసివచ్చే పార్టీల నేతలతో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగులతో భేటీ కానున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణానికి కూడా పర్యవేక్షించనున్నారు.

పీపుల్స్ ఫ్రంట్ పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు రోజులపాటు ఢిల్లీలో ఉండే సమయంలో ఎవరెవరిని కలవాలనే దానిపై కూడా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నట్టుగా సమాచారం. హస్తిన వేదికగా ఫ్రంట్ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా కొనసాగుతున్న కొన్ని పార్టీల నేతలు కూడా కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపారట. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రితో పలు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు కలిసి అవకాశం ఉందని చర్చ సాగుతోంది.

ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొన్ని రాజకీయ పార్టీల నేతలు కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడటమే కాకుండా భవిష్యత్తు రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయి వచ్చారు. హస్తిన వేదికగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరపడం కాకుండా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కావాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే రాజకీయ ప్రధాన అంశాలనే ఫోకస్ చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా దేశ రాజకీయాల కోసం ఒక పార్టీ జాతీయ కమిటీని కూడా నియమించాలని గులాబీ దళపతి భావిస్తున్నరట.

Tags:    

Similar News