CM KCR: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR: హైదరాబాద్‌ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

Update: 2021-07-04 08:10 GMT

సిరిసిల్ల డబల్ బెడ్ రూమ్ ఇల్లు (ఫైల్ ఇమేజ్)

CM KCR: తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఇంట్లో పూజ కార్యక్రమాల అనంతరం లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు.

సిరిసిల్లకు చెందిన పవర్‌ లూం కార్మికులతో పాటు నిరుపేదల కోసం మండేపల్లి వద్ద ప్రభుత్వం 1,320 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను 80 కోట్ల వ్యయంతో నిర్మించింది. 26 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టూ పద్ధతిలో.. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సకల సదుపాయాలతో నిర్మాణం చేపట్టింది. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేలా ఆట వస్తువులతో ఉద్యనవనాలు, ఓపెన్‌ జిమ్‌లు సైతం ఏర్పాటు చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం 2017లో ప్రారంభం కాగా.. ఏడాది క్రితమే పూర్తయ్యాయి. పారిశుధ్యం, మౌలిక వసతులతోపాటు ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు అందించే పైపులను ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News