హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో మార్చురీ సిబ్బంది జులుం

Hyderabad: రూ.వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామన్న ఆస్పత్రి సిబ్బంది.

Update: 2022-05-31 07:04 GMT

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో మార్చురీ సిబ్బంది జులుం

Hyderabad: హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో సిబ్బంది ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. మృతదేహాన్ని మార్చురీలోకి తీసుకువెళ్లడానికి కూడా మార్చురీ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి రూపాయలు ఇస్తేనే డెడ్ బాడీ తీసుకుంటామని తేల్చి చెప్పారు. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌కు చెందిన మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మజీద్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియాకు తరలించారు.

పోస్టుమార్టం చేసే వరకు డెడ్ బాడీని మార్చురీలో భద్రపర్చేందుకు తరలించారు. అయితే వేయ్యి రూపాయలు ఇస్తేనే డెడ్ బాడీని మార్చురీలో భద్రపరుస్తామనిని అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చెప్పారు. మద్యం మత్తులో ఉన్న సిబ్బంది మజీద్ కుటుంబ సభ్యులను డబ్బులు కోసం డిమాండ్ చేస్తూ బూతులు తిట్టారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఉస్మానియా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు మార్చురీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Tags:    

Similar News