Cipla Launching Covid-19 Drug: ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంటే, మరో వైపు కొంత మంది పరిశోధకులు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇండియాతో పాటు మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ ని కనుగొన్నామని చెప్పినప్పటికీ అది ఎప్పుడు సస్కెస్ అవుతుందో, ఎప్పుడు మార్కెట్లోకి వచ్చి ప్రజలందరికీ చేరుతుందో అంచనాకి అందట్లేదు. దీంతో కొన్ని ఫార్మాకంపెనీలు ఉన్న మందులకే కొత్త పేర్లను జత చేసి వాటిని రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే హెటిరో రెమ్‌డెసివిర్‌ను కోవిఫర్ పేరుతో రిలీజ్ చేసింది. ఇక తాజాగా అందరికీ సుపరిచమైన సిప్లా కంపెనీ సిప్లెంజా అనే పేరుతో (ciplenza) మందును ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ఈ మందును అమలులోకి తెచ్చేందుకు ఇప్పటికే కేంద్రం ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) అనుమతి కూడా ఇచ్చింది. ఇక ఈ మందును ఫవిపిరవిర్ API ద్వారా హైదరాబాద్‌కి చెందిన అవ్ర ల్యాబొరేటరీస్ తయారుచేస్తోంది. ఇక ఈ సిప్లెంజాతో కరోనాతో బాధపడేవారు కాస్త ఊరటని పొందవచ్చని సిప్లా కంపెనీ తెలిపింది. ఇక ఈ ఔషధం ఖరీదు చూసుకుంటే ఒక్క బాటిల్ ధర రూ.5400 ఉండనుంది. తాము తక్కువ ఖర్చుతోనే మందును తయారుచేస్తున్నామని అవ్ర ల్యాబొరేటరీస్ చెబుతోంది. ఇక ఈ సందర్భంగా అవ్ర ఛైర్మన్ డాక్టర్ ఏ వీ రామారావు మాట్లాడుతూ సిప్లాతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్‌కి తగ్గట్లుగా తయారుచేస్తామని వివరించారు. కరోనా అంతు చూసేందుకు ఇప్పుడు మరోసారి కలిసి పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే యాంటీ కాన్సర్, యాంటీ HIV సహా చాలా మందుల తయారీలో కలిసి పనిచేసినట్లు తెలిపారు. సిప్లా డాక్టర్ యూసుఫ్ హెమీడగైన్‌తో తనకు 50 ఏళ్ల స్నేహానుబంధం ఉందని ఆయన వెల్లడించారు.
ఇక పోతే ఈ ఏడాది ఆఖరిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని ముందుగా సంపన్న దేశాలే దక్కించుకునే అవకాశం ఉండ బోలేదు. ఇండియాలో వ్యాక్సిన్ వచ్చినా అది పేదలకు చేరడానికి మరింత టైమ్ పట్టొచ్చు. ఇండియా లాంటి దేశాలకు వ్యాక్సిన్ రావడానికి టైమ్ పట్టొచ్చు. ఆలోగా దేశంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట సమయంలో డెక్సామెథసోన్, రెమ్‌డెసివిర్, ఫవిరవిర్ వంటి మందులతో తయారుచేస్తున్న బ్రాండింగ్ మందులు కరోనా వైరస్ బాధితునిపైన బాగానే పనిచేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సిప్లా నుంచి సిప్లెంజా త్వరగా, తక్కువ రేటుకి అందుబాటులోకి వస్తే... అది పేదలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది.