నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకుంటాం : సీఎం కేసీఆర్
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం అన్నారు. లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు, కార్మికులకు పలు అంశాల్లో రాయితీలు, మినహాయింపులు కేటాయిస్తామన్నారు. టాలీవుడ్ సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కొవిడ్‌తో నష్టపోయిన సినీ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలీం చాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఏల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సీ కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి సీఎంను కలిశారు. త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమయి, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని సీఎం నిర్ణయించారు.