‍‎Nirmal: నిర్మల్ జిల్లాలో చిరుత పులి సంచారం

‍‎Nirmal: కడం ప్రాజెక్ట్ ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి

Update: 2021-10-13 05:06 GMT

నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం (ఫైల్ ఇమేజ్)

‍‎Nirmal: నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం భయాందోళన కలిగిస్తోంది. కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసింది చిరుత. ఒక గొర్రెను చంపేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిశీలించారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి రావడం, పశువులను చంపుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొద్దినెలల క్రితం ఇదే నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకలం రేపింది. పంట పొలాల సమీపంలో అడవి పందిపై చిరుత దాడి చేసింది. దీంతో పరిసరాల్లో ఉన్న పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు. ఇప్పుడు మళ్లీ చిరుత సంచరించడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. 

Tags:    

Similar News