Central Govt Suggests to Telugu States: క‌రోనా టెస్ట్‌ల‌ను పెంచండి: తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశం

Central Govt Suggests to Telugu States: దేశంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తుంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా త‌న పంజాను విసురుతుంది. నిన్న (శుక్రవారం) కొత్త‌గా దాదాపు 50వేల కేసులు న‌మోద‌య్యాయి.

Update: 2020-07-25 12:59 GMT
central govt suggests telugu states to increase the number of corona tests

Central Govt Suggests to Telugu States: దేశంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తుంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా త‌న పంజాను విసురుతుంది. నిన్న (శుక్రవారం) కొత్త‌గా దాదాపు 50వేల కేసులు న‌మోద‌య్యాయి. 775 మంది వైరస్‌ మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 13.37 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 31,406కి చేరింది. అలాగే క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 8.50 లక్షల మంది బాధితులు కోలుకోగా.. మరో 4.50 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కోర‌లు చాచుతుంది. ఏపీ, తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది.

క‌రోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. క‌మ్యూనిటీ ట్రాన్స్మిష‌న్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో... కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించింది. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని కేంద్రం పేర్కోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా .. మహారాష్ట్ర 9,615 కేసులతో తొలిస్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 8,147 కేసులతో రెండో స్థానంలో నిలిచింది . గడచిన వారం రోజులుగా మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  

Tags:    

Similar News