Breaking News: సీఎం కేసీఆర్ మహాధర్నాపై స్పందించిన కేంద్రం
Breaking News: యాసంగి లో ఎంత వడ్లు కొంటామనేది త్వరలో చెబుతామన్నది
Breaking News: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యాసింగిలో పంట కొనుగోళ్లపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామంది. ఖరీఫ్ సీజన్లో 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పెంచే పరిశీలనలో ఉన్నామని, గత రబీ సీజన్‌లో ఇచ్చిన హామీ మేరకు మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో ఉప్పుడు బియ్యం కొనే ప్రసక్తే లేదని, ఉప్పుడు బియ్యం తినే రాష్ట్రాలు సొంతంగా సేకరణ చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. జాతీయ ప్రయోజనాలు పంట వైవిధ్యం అవసరం అని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
మరోవైపు గత ఖరిఫ్ 32లక్షల రైస్ కొన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది 40లక్షల మెట్రిక్ టన్నులు పెంచామని, ఈ సీజన్‌లో 40లక్షల టన్నుల బియ్యం సేకరించేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు కేంద్ర సర్కార్ వ్యాఖ్యానించింది. అలాగే, మిగిలి ఉన్న పారా బాయిల్డ్ రైస్ సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేసిన కేంద్రం దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కి ప్రస్తుతం డిమాండ్ లేదని, ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయని వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం పప్పు దినుసులు, నూనె గొజలు సాగు చేయమని అన్ని రాష్ట్రాల రైతులను కోరుతున్నామని కేంద్రం ప్రకటించింది. వాటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్రం పేర్కొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆహార ధాన్యాలు నిల్వ చేసేందుకు కూడా స్థలం ఉండదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.