Krishna, Godavari Board: కృష్ణా, గోదావరి బోర్డుల అధికార పరిధి ఖరారు
Krishna, Godavari Board:తెలుగురాష్ట్రాల్లోని జలవనరులు బోర్డుల చేతికి * Nఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం
Krishna, Godavari Board: నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌తో అన్యాయం జరిగేలా ఉందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈగెజిట్‌తో రాష్ట్రానికి ఎంతవరకు అన్యాయం జరుగుతుందో అనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. దాదాపు నాలుగు గంటలపాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు విషయాలపై అధికారులతో చర్చించారు.
సాగునీరు, త్రాగునీటికి అన్యాయం జరగకుండా ఏవిధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై సీఎం కేసీఆర్ న్యాయ పరంగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకుసంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్న అంశాలపై అధికారులతో సమీక్షించారు. గెజిట్‌లోని అంశాలను అధికారులు వివరించడంతో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు నదీజలాల వినియోగంపై పలు సూచనలు చేశారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై న్యాయ నిపుణుల సలహాల ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే.., రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై న్యాయ పరంగా ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. మొత్తానికి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై తెలంగాణ గట్టి కార్యాచరణ రూపొందిస్తుంది.