ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరో నోటీసు జారీ
* విచారణ పూర్తయిన తర్వాత నోటీసులు ఇచ్చిన సీబీఐ.. CRPC సెక్షన్ 91 కింద నోటీసు అందించిన సీబీఐ
CBI: మద్యం కేసులో దక్షిణాది లాబీ అంశాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన శరత్‌చంద్రారెడ్డి, సీబీఐ అరెస్టు చేసిన బోయినపల్లి అభిషేక్, నిందితుడు రామచంద్ర పిళ్లైలతో పరిచయాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. దర్యాప్తులో వెల్లడైన అంశాలు, సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. కవిత ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి 'మీ వద్ద ఉన్న ఆధారాలు మాకు సమర్పించాల'ంటూ కవితకు 91 సీఆర్‌పీసీ కింద మరో నోటీసు జారీ చేసినట్లు సమాచారం.