భద్రాచలానికి రైల్వే లైన్: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మల్కన్ గిరి నుంచి పాండురంగాపురం వరకు భద్రాచలం మీదుగా కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-08-10 13:11 GMT

భద్రాచలానికి రైల్వే లైన్: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేసే ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 24,657 కోట్లు ఇందుకు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 2030-31 వరకు ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.

మల్కన్ గిరి-పాండురంగాపురం (భద్రాచలం మీదుగా), బంగ్రిపోసి-గోరుమహిసాని, గుణుపూర్-తేరుబలి (కొత్త లైన్), జునాగఢ్- నబంగ్పూర్, బాదంపహర్-కందుఝర్గఢ్, బురమారా-చకులియా, జల్నా-జల్గావ్, బిక్రమ్షిలా-కటారియా ప్రాజెక్టులను చేపడుతున్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 3 కోట్ల పనిదినాలు కల్పించడంతో పాటు కార్గో సామర్ధ్యాన్ని ఏటా 143 మిలియన్ టన్నులకు పెంచనున్నారు. అంతేకాదు కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించేందుకు గాను 30 కోట్ల మొక్కలను నాటాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు.

మల్కన్ గిరి నుంచి పాండురంగాపురం వరకు భద్రాచలం మీదుగా కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. గత ఏడాదే ఇందుకు సంబంధించిన సర్వే పనులు పూర్తయ్యాయి. దీనికి రూ.3,592 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా ఈ లైన్ వెళ్తుంది. ఈ లైన్ తో భద్రాచలానికి రైలులో కూడా వెళ్లే అవకాశం వస్తుంది. సరుకుల రవాణా కోసం ఈ మార్గాన్ని రూపొందించారు. మరో వైపు మహారాష్ట్రలోని అజంతా గుహలను కూడా ఈ రైల్వే నెట్ వర్క్ అనుసంధానించనుంది.

భధ్రాద్రి కొత్తగూడెం, రాయగడ, మల్కన్ గిరి, తూర్పు సింగ్బుమ్, నబరంగ్పూర్ జిల్లాలకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు వీలుగా 64 కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించనుంది ప్రభుత్వం. సరుకు రవాణకు ప్రాధాన్యతనిచ్చేలా రైల్వే లైన్ ను రూట్ మ్యాప్ ను తయారు చేశారు. సిమెంట్, ఉక్కు, సున్నపురాయి, అల్యూమినియం, ఇనుపఖనిజం, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణకు ఈ లైన్లను ఉపయోగించనున్నారు.

Tags:    

Similar News