Cabinet Meeting: రైతు రుణమాఫీపై కేబినెట్ కీలక నిర్ణయం
Cabinet Meeting: 50 వేల రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ * ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశం
Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది. 50 వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని ఆదేశాలిచ్చింది. రుణమాఫీపై కేబినెట్ లో చర్చ జరగగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన రుణమాఫీపై ఆర్థిక శాఖ వివరాలు సమర్పించింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 25 వేల రూపాయాల లోపు వారికే రుణాలు మాఫీ చేయగా.. తాజాగా 50 వేల వరకు రుణాలను మాఫీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.