Hyderabad: సంక్రాంతి రద్దీ.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Sankranti Festival: సొంతూళ్లకు పయనమవుతున్న జనాలు

Update: 2024-01-12 07:04 GMT

Hyderabad: సంక్రాంతి రద్దీ.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Sankranti Festival: సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరి బాట పట్టారు. నేటి నుంచి ఈ నెల17 వరకు స్కూళ్లకు, ఈ నెల13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో కుటుంబ సమేతంగా తరలివెళ్తుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్​బీనగర్,​ఆరాంఘర్ తదితర బస్​స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. మరోవైపు ప్రైవేట్​వాహనాలు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సొంత వాహనాల్లో తరలివెళ్లే వారితో టోల్​గేట్ల వద్ద కూడా బారులు తీరి ఉంటున్నాయి.

 పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్నిఏర్పాట్లు చేసింది. సిటీ నుంచి ప్రత్యేకంగా 700 బస్సులను నడుపుతోంది. సిటీ బస్సులను సైతం స్పెషల్​గా జిల్లాలకు వేశారు. తమ సొంతూళ్లకు వెళ్తుండగా.. ప్రధాన చౌరస్తాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. మరో రెండు రోజుల్లో రద్దీ ఇంకా పెరగనుంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎల్​బీనగర్​లోని విజయవాడ బస్టాప్ వద్ద కలగకుండా షామియానాలు, కుర్చీలు, పబ్లిక్​అడ్రస్ ​సిస్టం, మొబైల్​టాయిలెట్స్​ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా.. రద్దీ ఎక్కువగా ఉండే ఆరాంఘర్​లో 6​, ఉప్పల్​లో16 ​, ఎల్​బీనగర్​లో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని బస్ భవన్ ​లోని కమాండ్​ కంట్రోల్ ​సెంటర్​కు లింక్ చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News