బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబు.. నగరమంతా గులాబీమయం

*సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు భారీ స్వాగత తోరణాలు

Update: 2023-01-16 07:35 GMT

బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబు.. నగరమంతా గులాబీమయం

Khammam: బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి భారీ బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. నగరమంతా గులాబీమయమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారీ స్వాగత తోరణాలు, హోర్డింగులు, ఫ్లెక్సీలు, కౌటట్లు వెలిశాయి. ఖమ్మం సభ నేపథ్యంలో ఐదు లక్షల మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేశారు. ఇప్పటికే వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్నిచదును చేసి బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులు కూర్చునే వేదిక మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధులు, ముఖ్యనేతలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం భారీ డయాస్ సిద్ధమవుతోంది.

Tags:    

Similar News