ఎమ్మెల్సీ కవితకు మరో షాక్.. ఈసారి ఏకంగా నెల రోజులు కస్టడీ

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు.

Update: 2024-06-03 05:54 GMT

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్.. ఈసారి ఏకంగా నెల రోజులు కస్టడీ

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3వరకూ జుడీషియల్ కస్టడీని పొడగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈరోజుతో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజులు కస్టడీ విధించింది. మార్చి 26 నుంచి కవిత తిహాడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు.

Also Read: MLC Kavitha: కవితకు ఎందుకు బెయిల్ రావడం లేదు?

Tags:    

Similar News