MLC Kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

Update: 2024-08-12 05:39 GMT

MLC Kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

MLC Kavitha: BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇదే ధర్మాసనం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్సీ కవితకు సైతం బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసింది. నాటి నుంచి ఆమె తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 15న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది.

Tags:    

Similar News