బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రాజీనామా..?
Rathod Bapu Rao: త్వరలో కాంగ్రెస్‌లోకి బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు..?
Rathod Bapu Rao: బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. బోథ్ అసెంబ్లీ సీటు కేటాయిుంపుపై రాథోడ్ బాపురావు మనస్థాపానికి గురయ్యారు. ఈసారి బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ యాదవ్ ను అధిష్టానం ప్రకటించింది. దీంతో పార్టీ మారాలని రాథోడ్ బాపురావుపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది.