Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Update: 2024-09-06 05:41 GMT

Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ 2 నెలలకుపైగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచారు.

దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన జిట్టా తెలంగాణ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన ఆయన వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. ఆ తరువాత యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. తరువాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. చివరికి సొంత గూటికి(బీఆర్ఎస్)కి చేరుకున్నారు.

Tags:    

Similar News