KCR Speech: తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చింది.. బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ వద్దు: కేసీఆర్
KCR comments on Revanth Reddy: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఏం కోల్పోయారో వారికి తెలిసొచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు.
BRS chief KCR comments on CM Revanth Reddy: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఏం కోల్పోయారో వారికి తెలిసొచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వెల్ సమీపంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో పాలకుర్తి నియోజకవర్గ నేతలతో ఒక సమావేశం జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లి సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు చేస్తూనే బీఆర్ఎస్ నేతల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకున్న తెలంగాణ ప్రజలకు తేడా ఏంటో తెలిసొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరహాలో ఏదిబడితే అది చెప్పడం తమకు చేతకాదని, కానీ అలా తాము చేయలేమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 శాతం విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. "ప్రభుత్వం అంటే అందరిని కాపాడాలి. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు. సమాజాన్ని ఉద్దరించాలి. పది మందిని పైకి తీసుకురావాలి. సమాజాన్ని నిర్మించాలి. కానీ కూలగొడతా, పడగొడతా "అని అనడం సరికాదని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టిన హైడ్రా కూల్చివేతలను ఉద్దేశించి కేసీఆర్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
2025 నుండి కేసీఆర్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని, ఆయన మళ్లీ ప్రజా జీవితంలోకి వస్తారని ఇటీవల ఎక్స్ వేదికగా జరిగిన #AskKTR చిట్ చాట్ సెషన్ సందర్భంగా కేటీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో ఇక కేసీఆర్ ఫామ్ హౌజ్ వీడి జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారనే టాక్ బలంగా వినిపించింది. అందుకు తగినట్లుగానే తాజాగా కేసీఆర్ ఇలా పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయడం గమనార్హం.