కరీంనగర్ కు బ్రిటన్ టెన్షన్
* ఇటీవల బ్రిటన్ నుంచి కరీంనగర్ కు వచ్చిన 16 మంది * ఇప్పటివరకు 10 మంది శాంపిల్స్ సేకరించిన అధికారులు * మరో ఆరుగురి కోసం గాలింపు
కరీంనగర్ ను బ్రిటన్ టెన్షన్ వెంటాడుతోంది. ఇటీవల కరీంనగర్ కు బ్రిటన్ నుంచి 16 మంది వచ్చారని అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 10 మంది నుంచి వైద్య అధికారులు శాంపిల్స్ సేకరించారు. లండన్ నుంచి కరీంనగర్ వచ్చిన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు.
అసలు ఈ 16 మంది ఎన్నిరోజుల క్రితం బ్రిటన్ నుంచి కరీంనగర్ వచ్చారు? కరీంనగర్ వచ్చాక.. ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎవరెవరిని కలిశారు అనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు వీరిలో పది మందికి ఇప్పటికే టెస్టులు నిర్వహించగా.. మిగిలిన ఆరుగురి సమాచారం తెలిసిన వెంటనే వారి నుంచి కూడా శాంపిల్స్ సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.