Bowenpally Kidnap: అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ
Bowenpally Kidnap: * ఆరోగ్యకారణాలతో బెయిల్ ఇవ్వాలని కోరనున్న అఖిలప్రియ * బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ-1గా అఖిలప్రియ * రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
హైదరాబాద్ భూ వివాదం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ కోర్డులో విచారణ జరుగనుంది. తన ఆరోగ్యం కారణంగా బెయిల్ కోరుతూ అఖిలప్రియ పిటిషన్ వేశారు. అయితే అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే చాన్స్ ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు కిడ్నాప్ కేసులో బుధవారం మధ్యాహ్నం రిమాండ్ రిపోర్ట్‌లో ఒక్కసారిగా పరిణామాలు మారాయి. ఏ1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు.. ఏ1 గా ఉన్న అఖిలప్రియను గురువారం ప్రధాన నిందితురాలిగా మార్చారు. ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవ్‌రావ్‌గా చేర్చారు. ప్రధాన నిందితుడైనా ఏవీకి.. 41ఏ నోటీసులు ఇచ్చి పంపించడంతో మళ్లీ ఈ కేసు చర్చనీయాంశంగా మారింది ఇంతకు ముందున్న పాత పరిచయంతోనే తనపై ఆరోపణాలు చేశానన్నారు.
అఖిలప్రియ భర్త భార్గవ్‌రావ్ పరారీలో ఉన్నాడు. భార్గవ్‌రావ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరితో పాటు శ్రీనివాస్‌చౌదరి, సాయి, చంటి, ప్రకాశ్ సహా మరికొందరిని నిందితులుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.