Bowenpally Kidnap: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ట్విస్టులెన్నో
Bowenpally Kidnap * ఆ 50 ఎకరాలపై అసలు హక్కులెవరివి..? * ఏవీ, భూమా ఉమ్మడి ఆస్తిగా ఉందా..? * ఏవీ సుబ్బారెడ్డి భూమా ఫ్యామిలీని మోసం చేశారా..?
సంచలనం కలిగిస్తోన్న బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి సర్వే నెంబర్ 80వివాదంలో ఉన్న 50 ఎకరాలపై అసలు హక్కులెవరివి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ వివాదాస్పద భూమిలో పాతిక ఎకరాలు కొన్న ప్రవీణ్ రావు దానికి సంబంధించిన చెల్లింపులు సుబ్బారెడ్డికివ్వడం వివాదంగా మారిందా? సుబ్బారెడ్డి సెటిల్ మెంట్ చేసుకున్న విషయాన్ని భూమా ఫ్యామిలీకి చెప్పలేదా? అసలు అఖిల ప్రియ మళ్లీ ఎందుకు ఎంటరైనట్లు ? అనే ప్రశ్నలు రేగుతున్నాయి.
2016లో బోయిన్ పల్లిలో బాధితుడు ప్రవీణ్ 25 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అవే సర్వే నెంబర్‌తో ఆ భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్‌రామ్ లిటిగేషన్ పెట్టారు. ఈ వివాదంపై ఇరువర్గాల మధ్య చర్చలు జరగ్గా ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్ డబ్బు చెల్లించారు. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా ఈ విషయం తెలిసినా అఖిల ప్రియ కుటుంబం ప్రవీణ్ రావుపై కిడ్నాప్ స్కెచ్ వేయడం అనుమానాలకు తావిస్తోంది. పెరిగిన భూముల ధరల ప్రకారం మరింత సొమ్ము ఇవ్వాలంటూ అఖిల ప్రియ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
రెండేళ్ల క్రితమే ప్రవీణ్‌రావును కలిసిన భూమా కుటుంబ సభ్యులు ఈ భూమి వ్యవహారం గురించి ఆరా తీసినట్లు బాధితుడి బంధువులు చెబుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డితో సెటిల్ చేసుకోవటం ఏంటని ప్రశ్నించారన్నారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డి సెటిల్ చేసుకున్నది.. భూమా ఫ్యామిలీకి చెందిన స్థలమా లేక ఆయనకు చెందిన స్థలమా అనేది చిక్కుప్రశ్నగా మారింది. ఒకవేళ ఏవీ సెటిల్ చేసింది భూమా ఫ్యామిలీకి చెందిన భూమే అయితే.. మళ్లీ అదే భూమి కోసం అఖిలప్రియ ఎందుకు సీన్‌లోకి వచ్చినట్లు?
బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారం అంతా అఖిలప్రియ డైరెక్షన్‌లోనే జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు అఖిలప్రియను ఏ వన్‌గా చేర్చారు. దీంతో భూమా ఫ్యామిలీ అఖిలప్రియను టార్గెట్ చేసి.. అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. కూర్చొని సెటిల్ చేసుకుందామని చెబుతున్నారు.
మరి మాటలతో పోయే దాన్ని కేసుల దాకా తెచ్చుకోవటం దేనికి..? కిడ్నాప్ చేయించింది అఖిలప్రియ కానపుడు ఆ విషయాన్ని కచ్చితంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఇంత జరుగుతుంటే అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఎందుకు పరారీలో ఉన్నారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అటు పోలీసులు సెటిల్‌మెంట్ అయిపోయాక.. అఖిలప్రియ డీల్‌పై సీరియస్ అయినట్లు వెల్లడైందని తెలిపారు.భూమా నాగిరెడ్డితో తమకు ఎలాంటి ఇబ్బందులు, గొడవలూ లేవని ప్రవీణ్ కుమార్ కుటుంబం చెబుతోంది. వివాదాస్పద స్థలం భూమా నాగిరెడ్డికి, ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి అని వాదిస్తోన్న అఖిల ప్రియ ఆ సొమ్ములో తమకూ వాటా ఉందని భావిస్తోందా? సుబ్బారెడ్డి మోసం చేస్తే అతనితో గొడవ పడటం మానేసి నేరుగా ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి కిడ్నాప్ ప్లాన్ చేయడమే ఆమె అరెస్టుకు దారి తీసినట్లు తెలుస్తోంది. అందుకే ఏ2గా ఉన్న అఖిల ప్రియను పోలీసులు ఏ1 గా మార్చాల్సి వచ్చిందన్నది పోలీసుల వెర్షన్ గా కనిపిస్తోంది.
డబ్బుల కోసం ప్లాన్ చేసిన అఖిలప్రియ దంపతులు సాయి అనే వ్యక్తితో ఈ కిడ్నాప్ చేయించినట్లు తెలిపారు పోలీసులు. కిడ్నాప్ తర్వాత వారితో ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించారన్నారు. ఈ సమయంలో కిడ్నాపర్లు ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ పేర్లను ప్రస్తావించినట్లు బాధితులు తమ దర్యాప్తులో తెలిపారని.. అఖిల ప్రియను ముందే అదుపులోకి తీసుకోకుంటే సాక్ష్యాలు తారుమారు చేసేవారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరి ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అఖిలప్రియ తానే ఇరుక్కుందా? ఎవరైనా ఇరికించారా?అనేది తేలాల్సి ఉంది.
బోయిన్‌పల్లిలో ఉన్న భూమి తమదే అని వాదిస్తోన్న అఖిలప్రియ ఆధారాలు చూపాలన్నారు ప్రవీణ్ సోదరుడు ప్రతాప్. ఏవీ సుబ్బారెడ్డితోనే భూ వ్యవహరాలపై చర్చించామన్న ఆయన భూమా ఫ్యామిలీ ఇప్పుడు వచ్చి దౌర్జన్యం దారుణమన్నారు. ఆధారాలు చూపితే వారి భూమి వారికిస్తామంటోన్న ప్రతాప్ రావు