సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు
సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ1గా ఉన్న అఖిల ప్రియకు బెయిల్ వస్తుందా? ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలన్న అఖిల ప్రియ న్యాయవాదుల వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తుందా? లేక పోలీసుల కస్టడీకి ఇస్తుందా? అసలు అఖిల ప్రియ హెల్త్ కండీషన్ ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి నివేదికను కోర్టుకు సమర్పిస్తారు... ఎన్నో ప్రశ్నలు ఈ కిడ్నాప్ కేసు చుట్టూ తిరగుతున్నాయి.
బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కేసు విషయంలో భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ జైల్‌లో ఉన్న అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితి సరిగ్గా లేదని ప్రెగ్నెంట్ కావడం, ఫిట్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. అన్ని వాదనలు విన్న ధర్మాసనం అఖిలప్రియ హెల్త్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో ఉస్మానియాలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐతే అఖిలప్రియకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పరీక్షల్లో తేలినట్లు సమాచారం. కోర్టులో మాత్రం ఫిట్స్, ఇతర ఆరోగ్య సమస్యలతో అఖిలప్రియ బాధ పడుతుందని మెరుగైన వైద్యం కోసం బెయిల్ మంజూరు చేయాలని ఆమే తరపున న్యాయవాదులు వాదించారు. కానీ మరోసారి నిర్వహించిన వైద్యపరీక్షల్లో అఖిలప్రియ హెల్త్‌కు సంబంధించి ఎలాంటి ఆరోగ్యం సమస్యలు లేవని తేలడంతో బెయిల్ విషయంలో ఆసక్తి నెలకొంది.
బెయిల్‌తో పాటు పోలీసులు కౌంటర్ పిటీషన్ దాకలు చేయడం జరిగింది అఖిల ప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రోరారు కేసుకు సంబంధించి దర్యాప్తు మరింత లోతుగా చేసేందుకు ఆమేను కస్టడీలోకి తీసుకోవాలని కోర్టుకు తెలిపారు ఎట్టి పరిస్ధితుల్లో అఖిల ప్రయకు బెయిల్ మంజూరు చేయొద్దని ఆమే బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేయడంతో పాటు కేసు సైతం తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు ఇప్పటికే ఈ కేసులో ఏ3గా ఉన్న అఖిల ప్రియ భర్త బార్గవ్ రామ్ పరారీలో ఉన్న క్రమంలో ఆయను కూడా అదుపులోకి తీసుకొని అఖిల ప్రయను కూడా కస్టడీలోకి తీసుకుంటే కిడ్నాప్ కేసుకు క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
ఓక్క వైపు బెయిల్ మరో వైపు కస్టడీ రెండు పిటీషన్ వాదనలు సోమవారం జరగనున్న నేపధ్యంలో ఉత్కంఠ నెలకొంది హెల్త్ ఇష్యూ కారణంగా ఆమేకు బెయిల్ మంజూరు అవుతుందా లేక పోలీసులు పంతం నెగ్గించుకొని కస్టడీలోకి తీసుకుంటారా చూడాలి మరీ.