Bonthu Rammohan: నాకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులూ రాలేదు..!
Bonthu Rammohan: మేము ఎలాంటి తప్పు చేయలేదు
Bonthu Rammohan: సీబీఐ నోటీసులు ఇస్తే సమాధాన ఇస్తానని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.. తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ఏది నిజం.. ఎంతవరకు నిజం.. మున్ముందు తెలుస్తుందన్నారాయన.. నా ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉన్నంత మాత్రాన అరెస్టు చేశారని అనడం భావ్యం కాదన్నారు. కొంతమందిపై ఆరోపణలు వచ్చినప్పుడు... నిందితులుగా చేర్చినప్పుడు జైలుకు వెళ్లి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని.. అంతమాత్రాన తప్పు చేశారని కాదన్నారాయన... మేము తప్పు చేయలేదు.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు బొంతు... నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. ఏది వచ్చినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.