Bathukamma Festival: తెలంగాణలో మొదలైన పూల పండుగ
Bathukamma Festival: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ సంబరం
Bathukamma Festival: తెలంగాణలో పూల సంబరం మొదలైంది. మహిళలు, యువతులు, చిన్నారులు బొడ్డెమ్మ ఆటలు ఆడుతున్నారు. పితృ అమావాస్యకు తొమ్మిది రోజుల ముందే బొడ్డెమ్మ సంబరాలు ప్రారంభించుకుంటారు. కొన్ని ప్రాంతాలవారు బొడ్డెమ్మను ఏడు రోజుల్లో కూడా ప్రారంభిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బొడ్డెమ్మ సంబరం మొదలైంది. యువతులు, చిన్నపిల్లలు కలిసి ఒక పీఠపైన ఎర్రమట్టితో అంతస్తులుగా, గుండ్రంగా బొడ్డెమ్మను తయారు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం అలంకరించి.. దూపదీప నైవేద్యాలతో అర్చిస్తూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడుతున్నారు.