Digital Frauds: వ్యాక్సిన్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు

Digital Frauds: మెడిసిన్‌ కావాలంటే నేరుగా వెళ్లి తీసుకోవాలి కానీ ఆన్‌లైన్‌ను నమ్ముకుని మోసపోవద్దంటున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Update: 2021-05-02 12:00 GMT

Representational Image

Digital Frauds: రోజురోజుకు సైబర్‌ నేరగాళ్లు అప్‌డేట్‌ అవుతున్నారు. పోలీసులకే అంతుచిక్కని స్కెచ్‌లు వేస్తూ, క్రైమ్స్‌కు పాల్పడుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని నయా మోసాలకు పాల్పడుతున్నారు ఈ కేటుగాళ్లు. కరోనా వేళ వ్యాక్సిన్‌ కావాలా అంటూ ట్రెండీ మోసాన్ని స్టార్‌ చేశారు.

మీకు కరోనా వ్యాక్సిన్‌ కావాలా..? మరి ఇంకెందుకు ఆలస్యం, అకౌంట్‌లో లక్ష రూపాయలు డిపాజిట్‌ చెయ్యండి క్షణాల్లో వ్యాక్సిన్‌ మీ ఇంట్లో ఉంటుంది. ఇలాంటి కాల్స్‌ కానీ మెసేజ్‌లు కానీ మీకు వస్తున్నాయా..? అయితే వాటిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే కరోనా కాలంలో ఇలాంటి కాల్స్‌, మెసేజ్‌లను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్‌ నేరగాళ్లు.

ఇటీవల వ్యాక్సిన్ పేరుతో ఆన్‌లైన్‌ మోసానికి తెరలేపారు సైబర్‌ నేరగాళ్లు. అవును నగరంలోని మూడు కమిషనరేట్‌ పరిధుల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రిజిస్టర్‌ చేసుకుంటే చాలు రెమిడీసివర్‌ ఇంజెక్షన్లు పంపుతామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అటు సోషల్‌ మీడియాలో వస్తున్న మెసేజ్‌లు, యాడ్స్‌ను నమ్మద్దొంటున్నారు పోలీసులు.

ఇక కరోనా కష్ట సమయంలో మెడిసిన్‌ కావాలంటే నేరుగా వెళ్లి తీసుకోవాలి కానీ ఆన్‌లైన్‌ను నమ్ముకుని మోసపోవద్దంటున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. కొత్త మార్గాల్లో సైబర్‌ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నందున వారినుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్‌. మొత్తానికి కరోనా విపత్కర పరిస్థితులను కూడా సైబర్‌ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఎవరిపైనా అనుమానం వస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News