కేవలం ఐదు రోజుల్లోనే రాజకీయ పరిస్థితులు మారతాయన్న బీఎల్ సంతోష్

BL Santhosh: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మారుతున్న రాజకీయాలు

Update: 2023-10-07 16:00 GMT

కేవలం ఐదు రోజుల్లోనే రాజకీయ పరిస్థితులు మారతాయన్న బీఎల్ సంతోష్

BL Santhosh: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కొత్త మలుపు కనిపిస్తోంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు మార్చడానికి తమకు కేవలం ఐదు రోజులు చాలని బీజేపీ ఆర్గనైజింగ్ ఇంచార్జ్ బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు ధీమా కల్పించారు. తెలంగాణపై ఫోకస్ పెంచిన బీజేపీ అధిష్టానం వద్ద అమ్ములపొదిలో ఓటర్లను ఆకట్టుకునే అస్త్రాలు ఉన్నాయనే నమ్మకం కనిపించింది. అందుకే పార్టీ నేతలకు సంతోష్ తమకు ఐదు రోజులు చాలని నిన్నటి కీలక సమావేశంలో చెప్పుకొచ్చారు.

తమకు ఐదు రోజులు చాలని తెలంగాణలో సంతోష్ పార్టీ నేతలకు ఇచ్చిన ధీమా వెనుక అసలు కారణాలేంటి...? తెలంగాణలో బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుందనేది అంతుచిక్కని ప్రశ్న.. ఇప్పటికే జాతీయ పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. గత ఎన్నికల నుంచి బీజేపీ నేతలు ఈ విషయాన్ని నాన్చుతూ వచ్చారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాట మార్చారు. స్పైసెస్ బోర్డు తెచ్చి.. లోకల్‌గా రైతుల నోళ్లు అప్పటికప్పుడు మూయించగలిగారు. కానీ ప్రధాని మాత్రం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

గిరిజిన యూనివర్శిటీ ఏర్పాటుపై ప్రతి సారీ విమర్శించే కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్లు మూయించడానికి ప్రకటన చేశారు ప్రధాని మోడీ.. ఇవే కాకుండా తెలంగాణ బీజేపీ ఇంకా ఏం చేయబోతోంది..? కొత్త పథకాల ప్రకటన ఉంటుందా.. కేంద్ర పరిధిలోని పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని తెలంగాణకు విస్తరించేలా స్పెషల్ ప్లాన్ ఏమయినా చేసిందా..? అని బీజేపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతున్న... వర్గీకరణ అంశాన్ని కదపడానికి సిద్ధం అవుతుందా అనేది తేలాల్సి ఉంది. కాగా ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. త్వరలో ఆ అంశాన్ని కదిపి తెలంగాణలో మేజర్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని తేలిపోయింది... ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మందకృష్ణ మాదిక భేటీ అయ్యారు. త్వరలోనే ఈ అంశాన్ని కదిపేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు... తెలంగాణలో మేజర్ ఓటు బ్యాంకుగా అందరికీ తెలిసిన దళితులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనేది నిజం.

తెలంగాణలో బీజేపీ... ఉచిత విద్య... వైద్యం పథకాన్ని తెరమీదకు తెచ్చే యోచనలో ఉందని అంటున్నారు...? అందుకే బీఎల్ సంతోష్ తెలంగాణలో.. తమకు ఐదు రోజులు చాలు అని అన్నారని తెలుస్తోంది. తెలంగాణలో పెండింగ్ ఉన్న హామీలను ఆఘమేఘాల మీద అమలు చేసినా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కమలం కసరత్తు చేస్తుందా లేదా అంతుబట్టడం లేదు... వరుస సమావేశాలు... హెచ్చరికలు.. ఆరోపణలు.. హామీల ప్రకటనలతో బీజేపీ వ్యూహం తెరమీదకు తెస్తోంది.

Tags:    

Similar News