గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నట్లు ఆ పార్టీ నేత ఫడణవీస్ పేర్కొన్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సమని గుర్తుచేశారు. 12 ఏళ్ల కిందట ముంబయిపై ఉగ్రదాడులు జరిగింది కూడా ఇదే రోజు అని పేర్కొన్నారు. దేశమంతటికీ 1947లో స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబరు 17 న వచ్చిందని వివరించారు.
మేనిఫెస్టోలోని అంశాలు..
మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం
గ్రేటర్‌లో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకాలు
నివాస ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా మంచినీరు
బస్తీల్లో వందశాతం ఆస్తి పన్ను మాఫీ ఎల్ఆర్ఎస్ రద్దుతో15 వేల కోట్ల భారం హైదరాబాద్ ప్రజలపై పడకుండా విముక్తి..
వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు అకౌంట్ లో పడుతాయి..
ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు...
మెట్రో రైలు ,సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..
ఆన్‌లైన్ క్లాస్‌లకు ఉచిత ట్యాబ్లు..
ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ..
ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించడం..
మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం..
సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత..
100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్