Raghunandan Rao: గచ్చిబౌలి స్టేడియం స్థలాన్ని టిమ్స్‌కు ఇవ్వడం సరికాదు
* టిమ్స్‌కు పంచనామా చేసి ఇచ్చిన భూమిని తిరిగివ్వాలి: రఘునందన్ * భూమిని తిరిగివ్వకపోతే మంగళవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన
Raghunandan Rao: గచ్చిబౌలి స్టేడియం మధ్యలో నుంచి ఐదెకరాల స్థలాన్ని టిమ్స్‌కు కేటాయించడం సరైందికాదని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. టిమ్స్‌కు పంచనామాచేసి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వకపోతే మంగళవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఎల్బీస్టేడియం పరిస్థితి అద్వాన్నంగా తయారైందని, మౌలిక సదుపాయాలు లేకపోతే క్రీడాకారులు ఎలా పుట్టుకు వస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
క్రీడా విలేజ్ ఏర్పాటు చేస్తానన్న సీఎం కేసీఆర్ ఏడేళ్లయినా నిర్మించలేదని గుర్తుచేశారు. సరూర్‌నగర్ స్టేడియంలో కోచ్‌లకు ఐదేళ్లుగా జీతాలు లేవని, స్టూడెంట్స్ తలో కొంత వేసుకొని కోచ్‌కు జీతం చెల్లించే పరిస్థితి దాపరించిందన్నారు. స్టేడియాలను ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు.