టీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఆందోళన, అభద్రత కొట్టొచ్చినట్టు కనిపించిందన్నారు బీజేపీ నేత డీకే అరుణ. మేయర్ ఎన్నికలో ఎంఐఎంతో టీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదర్చుకున్నారన్నారు ఆమె. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌తో పొత్తులేదని చెప్పిన కేటీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు.
నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ ఫైరయ్యారు. సీఎం అహంకారం పరాకాష్టకు చేరిందన్నారు ఆమె. మహిళలను సీఎం కుక్కలతో పొల్చడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌కు మహిళలపట్ల గౌరవం లేదంటూ విమర్శించారు.