నెక్లెస్‌ రోడ్‌లో బీజేపీ కైట్ ఫెస్టివల్

Update: 2021-01-14 08:23 GMT

కరోనా నుంచి కోలుకుని దేశ ఆర్థికరంగం మెల్లగా గాడిన పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వైరస్ కట్టడికి కృషి చేసిన ప్రధాని మోడీ వ్యాక్సిన్ కోసం సైంటిస్ట్ లకు ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ను కనుగొన్న ఆరు కంపెనీల్లో ఒకటి హైదరాబాద్ కంపెనీ ఉండడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఉత్సాహంగా పతాంగులు ఎగురవేశారు. ఈ సంక్రాంతి ద్వారా ప్రజల జీవితాల్లో కాంతి రావాలని, కరోనా వ్యాక్సిన్ పంపిణీని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న నిజమైన క్రాంతి రావాలని.. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించే నిజమైన రోజులు రావాలని కోరుకుంటున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News