జితేందర్‌ను లక్కీ హ్యాండ్‌గా నమ్ముతున్న బీజేపీ.. మరి హుజురాబాద్‌లోనూ చక్రం తిప్పుతారా?

Huzurabad: తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా, బీజేపీలో ఆయనే ఇంచార్జ్ పార్టీలోకి ఆయన కొత్తగా వచ్చినా, ఆ లీడర్‌ను మాత్రం నెత్తికెత్తుకుంటోంది కమలం.

Update: 2021-06-26 09:33 GMT

జితేందర్‌ను లక్కీ హ్యాండ్‌గా నమ్ముతున్న బీజేపీ.. మరి హుజురాబాద్‌లోనూ చక్రం తిప్పుతారా?

Huzurabad: తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా, బీజేపీలో ఆయనే ఇంచార్జ్ పార్టీలోకి ఆయన కొత్తగా వచ్చినా, ఆ లీడర్‌ను మాత్రం నెత్తికెత్తుకుంటోంది కమలం. దుబ్బాకలో అనూహ్య విజయం సాధించడంతో, వరుస ఎన్నికలకు ఆయన్ను ఎన్నికల ఇంచార్జుగా నియమిస్తూ, సెంటిమెంటుగా భావిస్తోంది. అందుకే ఇప్పుడు హుజూరాబాద్ బైపోల్‌కు సైతం ఇంచార్జిగా ప్రకటించింది. ఇంతకీ కాషాయ పార్టీ లక్కీ హ్యాండ్‌గా భావిస్తున్న ఆ నేత ఎవరు? హుజురాబాద్‌లోనూ దుబ్బాకను రిపీట్‌ చేసే సత్తా ఆయనకుందా?

ఆయనే మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి. టీఆర్ఎస్‌ మాజీ నేత. బీజేపీ తాజా నేత. 2014లో మహబూబ్‌ నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ తరపున చక్రంతిప్పారు. అయితే, రకరకాల కారణాలు, సమీజకరణాల నేపథ్యంలో, 2019లో జితేందర్‌కు టిక్కెట్టివ్వలేదు గులాబీ బాస్. దీంతో తన పాత గూడు అయిన భారతీయ జనతా పార్టీకి తిరిగొచ్చారు. ఎన్నికల్లో పోటి చేయకుండానే పార్టీ కోసం పని చేశారు. సీఎం కేసిఆర్ అవమానించినా, సైలెంటుగా తన పనితాను చేసుకుంటూ ఎలాంటి వివాదాలకు పోకుండా, బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు. జితేందర్‌ రాకతో చాలా ఎన్నికల్లో పార్టీకి సానుకూల ఫలితాలు వస్తున్నాయని నమ్ముతోంది బీజేపీ. ఇంచార్జీగా నియమించిన చాలా ఎలక్షన్స్‌లో దీటైన ఫలితాలు రాబట్టారని, జితేందర్‌ను తెగ నమ్ముతోంది కాషాయం.

దుబ్బాక బైపోల్‌లో బీజేపీ ఇంచార్జీగా తొలుత బాధ్యతలు అప్పగించింది బీజేపీ. అక్కడ అనూహ్య విజయంతో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలనూ ఇచ్చింది. వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సైతం ఆయనే ఇంచార్జీ. దుబ్బాకలో గ్రాండ్‌ విక్టరీతో, స్టేట్‌ మొత్తం ఆ వైబ్రేషన్‌ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సైతం 48 స్థానాలు రావడంతో, దుబ్బాక జోరు కంటిన్యూ అయ్యింది. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఎంతోకొంత బీజేపీ బలపడిందన్నది ఆ పార్టీ ఆలోచన. ఈ మూడు చోట్లా మంచి ఫలితాలు రావడంతో, లక్కీ హ్యాండ్‌గా జితేందర్‌ రెడ్డికి ముద్రపడింది. ఆయనను ఎన్నికల ఇంచార్జీగా నియమిస్తే, అక్కడ పార్టీలో అంతర్గత విభేదాలును పరిష్కరించి, పార్టీని విజయాల బాటపట్టిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది.

సక్సెస్‌ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న జితేందర్‌ రెడ్డిని, ఇప్పుడు హుజురాబాద్‌ బైపోల్ ఇంచార్జీగానూ నియమించింది బీజేపీ. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు కీలకం కావడంతో, ఇప్పటి నుంచే అక్కడ గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టాలని సూచించింది. ఇఫ్పటికే జితేందర్‌ క్షేత్రస్థాయి రియాల్టీ చెక్‌ చేస్తున్నారట. ఈటలకు కోసం బీజేపీ అనుబంధ వ్యవస్థలను ఏకం చేస్తున్నారట. ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తల మధ్య సమన్వయానికి ప్రయత్నిస్తున్నారట. అయితే, అటువైపు కేసీఆరే రంగంలోకి దిగి హుజురాబాద్‌పై దృష్టిపెట్టారు. ట్రబుల్ షూటర్ హరీష్‌ రావు ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేస్తున్నారు. కేటీఆర్ టీం కూడా గ్రౌండ్‌లోకి దిగింది. చతురంగ బలగాలన్నీ మోహరిస్తున్నారు. మరి వీరందరి వ్యూహాలను ఎదుర్కొని జితేందర్‌ ఈటలను గెలిపిస్తారా? సక్సెస్‌ హ్యాండ్‌గా పేరు నిలబెట్టుకుంటారా? చూడాలి, హుజురాబాద్‌లో ఏం జరుగుతుందో.

Tags:    

Similar News