మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన బీజేఎల్పీ నేత ఏలేటి
Maheshwar Reddy: బీఆర్ఎస్ అగ్ర నేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బిజెపి శాసన సభ పక్షనేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు.
Maheshwar Reddy: బీఆర్ఎస్ అగ్ర నేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బిజెపి శాసన సభ పక్షనేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఈ నెల 11 న జరగనున్న తన పెద్ద కూతురు వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ కేసీఆర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్‌పై రాజకీయపరంగా తరచూ విమర్శలు చేసే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజా భేటీ పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది.