Bird Flu scare: నిజామాబాద్ జిల్లాలో కోళ్ల మృత్యువాత
Bird Flu scare: * అకస్మాత్తుగా కుప్పకూలుతున్న కోళ్లు * బర్డ్ ప్లూగా అనుమానం వ్యక్తంచేస్తు్న్న గ్రామస్ధులు * మూడురోజుల వ్యవధిలో 200 లకు పైగా కోళ్లు మృతి
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో బర్ల్ ప్లూతో కోళ్లు, విదేశీ పక్షులు మృత్యువాత పడుతుండటంతో నిజామాబాద్ జిల్లా వాసుల్లో భయం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో బర్ల్ ప్లూ కేసులు వెలుగు చూడనప్పటికీ నిజామాబాద్ జిల్లా వర్ని మండం జలాల్ పూర్ లో కొద్ది రోజులుగా కోళ్లు అకస్మాత్తుగా మృత్యువాత పడుతుండటం ఆందోళన కు గురిచేస్తోంది. బర్ల్ ప్లూ తోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్ధులు అనుమానం వ్యక్తం చేస్తుండగా పశు సంవర్ధక శాఖ అధికారులు మాత్రం బర్ల్ ప్లూ
ఆనవాళ్లు లేవని స్పష్టం చేస్తున్నారు. రానికేట్ అనే వ్యాధితో మృతి చెందుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. రక్త నమూనాలు సేకరించి కోళ్ల మృతికి కారణాలను వెతికే పనిలో పడ్డారు. జిల్లాలో 380 పౌల్ట్రీ ఫారాలు ఉండగా 8లక్షల కోళ్లను పెంచుతున్నారు. కోళ్ల ఫారాలలో బర్ల్ ప్లూ పై అవగాహన కల్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు.