Telangana Secretariat: నేడు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..
Telangana Secretariat: నేడు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం.. సచివాలయంలో సీఎం చూసిన ప్రదేశంలోనే భూమి పూజ చేయనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.