Bhima Koregaon Case: తెలుగు రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు
Bhima Koregaon Case: కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం నేత వరలక్ష్మి ఇంట్లో NIA అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Bhima Koregaon Case: కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం నేత వరలక్ష్మి ఇంట్లో NIA అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బీమా కొరేగావ్ కేసుకు సంబంధించి NIA సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విరసం నేతగా ఉన్న వరలక్ష్మిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. అటు తెలంగాణలో ఉన్న పలువురు ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలో కూడా NIA సోదాలు నిర్వహిస్తోంది. ప్రజా సంఘాల నేత, ప్రముఖ న్యాయవాది రఘునాథ్ నివాసంతో పాటు, డప్పు రమేష్ ఇంట్లో NIA అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే అంశంలో ప్రొఫెసర్ కాశీమ్, నలమాస కృష్ణతో పాటు పలువురిని NIA అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి రెండు రాష్ట్రాల్లో NIA అధికారులు తనిఖీలు చేపట్టడం అలజడి రేపుతోంది.