Free Food For Covid Patients.. బాధితులకు అండగా భార్గవ్ దంపతులు
Free Food For Covid Patients: కొవిడ్ బారిన పడిన ఫ్యామిలీ వద్దకు ఒక్కరైనా వెళ్లడంలేదు. గుప్పెడు మెతుకులు కాదుకదా కనీసం వారికి గుక్కెడు మంచి నీళ్లు ఇచ్చేవారు కూడా కరువైయ్యారు.
Free Food For Covid Patients: కరోనా రక్కసి దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి మనుషుల మధ్య వున్న మానవత్వాన్ని మంటకలుపుతుంది. ఈ ప్రాణాంతక వైరస్ దాటికి అందరూ జంకుతున్నారు. ఈ వైరస్ చోరబడిన కుటుంబాల్లో ఇంటిల్లిపాదిని తన బుట్టలో వేసుకుంటుంది. ఒళ్లు నొప్పులతో అవస్తలు పడుతూ.. వంట చేసుకునే ఓపిక కూడా వారికి లేదు. కొవిడ్ బారిన పడిన ఫ్యామిలీ వద్దకు ఒక్కరైనా వెళ్లడంలేదు. గుప్పెడు మెతుకులు కాదుకదా కనీసం వారికి గుక్కెడు మంచి నీళ్లు ఇచ్చేవారు కూడా కరువైయ్యారు. ఇలాంటి సమయంలో మనషుల్లో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపారు అమీన్ పూర్ కు చెందిన దంపతులు భార్గవ్-ఉమామహేశ్వరి.
కరోనా బారినపడి ఇబ్బందులు పడేవారికి మేమున్నాం అంటూ దైర్యం చెబుతున్నారు అమీన్ పూర్ కు చెందిన దంపతులు భార్గవ్-ఉమామహేశ్వరి. కరోనా రోగులకు రెండు పూటల భోజనం పెట్టి వారి ఆకలి తీరుస్తున్నారు. భార్గవ్-ఉమామహేశ్వరి దంపతులతోపాటు బోయపాటి సాయిచంద్ కలిసి 2015లో హెల్పింగ్ స్పాట్ అనే స్వస్ఛంద సంస్థను స్థాపించారు. పేదల ఆకలి తీర్చే ఉద్ధేశ్యంలో దీనిని స్థాపించారు. నో ఫుడ్ వేస్టేజ్ అనే నినాదంలో పెళ్లిళు, ఇతరత్రా ఫంక్షల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి బిక్షగాళ్లకు, నిరాదరణ గురైన వృద్ధులకు అందించే వారు.
అయితే గత కొన్నేళ్లుగా వాలంటీర్ల సాయంతో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఏడాది కరో్నా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వారు కొవిడ్ రోగులకు ఆహారాన్ని అందించారు. ప్రస్తుతం రోజుకు 200మందికిపైగా ఆహారాన్నిఅందిస్తున్నారు. వీరి సంస్థలో 15 మంది వాలంటీర్లు కొవిడ్ రోగులకు ఆహారాన్ని అందించేదుకు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. హెల్పింగ్ స్పాట్ సంస్థ హైదరాబాద్ లోని కూకట్ పల్లి, మియాపూర్, షామిర్ పేట్, అమిన్ పూర్,చందా నగర్, బాబుగూడ, పరిధిలోని హోం క్వారంటైన్ లో ఉంటున్న కొవిడ్ రోగులకు రెండు పూటల ఆహారాన్ని అందిస్తున్నారు. హెల్పింగ్ స్పాట్ సంస్థను విస్తరించాలని చూస్తున్నారు.
ఉమామహేశ్వరి స్వయంగా ఇంట్లోనే కూరలు, అన్నం తయారు చేసి పంపిస్తారు. వాలంటీర్లు రాకుంటే భార్గవ్- ఉమామహేశ్వరిలో ఎవరో ఒకరు కరోనా రోగులకు ఆహారాన్ని అందిస్తున్నారు. రోగుల ఇంటి గుమ్మం ముందుకు వచ్చి పొట్లాలను ఉంచి వెళ్తారు. భార్గవ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. వృత్తిరిత్యా ఎంత బీజీగా ఉన్నా తన బాధ్యతను మరిచిపోడు. ఇందులో తన భాగస్వామి భార్గవ్ కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. ఆహారం కావాల్సిన వారు 88866-86000, 81799-59990 నెంబర్ కు కాల్ చేయాలని, ఒక రోజు ముందుగా చెప్పాలని సూచించారు. ఫోన్ చేసి వాట్సాప్ లో లోకేషన్ పంపిస్తే నేరుగా ఇంటి వద్దకే వచ్చి భోజనం ప్యాకెట్ పెడతామని స్పష్టం చేశారు.