Bhadradri: శ్రీరాముడి కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి

Bhadradri: విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ఆలయం

Update: 2024-04-16 16:17 GMT

Bhadradri:శ్రీరాముడి కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి

Bhadradri: శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శ్రీరామనవమి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రామాలయానికి విద్యుత్‌ దీపాలంకరణలు, చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు, బాపు రమణీయ చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. స్వాగత ద్వారాలు భక్తరామదాసు కీర్తనలతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోయింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు. కల్యాణోత్సవంలో భాగంగా జరిగే... ఎదుర్కోలు కార్యక్రమం, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పోలీసుశాఖ 1800 మందికి పైగా సిబ్బందితొ బందోబస్తు ఏర్పాటు చేసింది.

శ్రీరామనవమి ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఐటీడీఏ పీవో, దేవస్ధానం ఈవో రమాదేవిలు పరిశీలించారు. వీవీఐపీ సెక్టార్‌లతో పాటు ఇతర సెక్టార్లలో చేపట్టాల్సిన మార్పుల గురించి స్ధానిక అధికారులకు సూచనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు 24 సెక్టార్లలో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

Tags:    

Similar News