ప్రచార ర్యాలీలో తేనెటీగల దాడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతకు తప్పిన ప్రమాదం

Gongidi Sunitha: తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రావడంతో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి.

Update: 2023-11-04 11:45 GMT

ప్రచార ర్యాలీలో తేనెటీగల దాడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతకు తప్పిన ప్రమాదం

Gongidi Sunitha: తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రావడంతో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రచారం నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ప్రచార రథంపై ఉన్న ఆమె అప్రమత్తమై.. తన వాహనంలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. నాయకులు కండువాలు కప్పుకొని తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. కాసేపటి తర్వాత యధావిధిగా ప్రచారం కొనసాగించారు. తేనెటీగల దాడిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News