Rain Alert: బలపడుతున్న అల్పపీడనం..నేడు ఆ ప్రాంతాల్లో కుండపోత వర్షం

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం నెమ్మదిగా బలపడుతోంది. ఇది రేపు వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

Update: 2024-09-08 01:51 GMT

Rain Alert: బలపడుతున్న అల్పపీడనం..నేడు ఆ ప్రాంతాల్లో కుండపోత వర్షం

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం నెమ్మదిగా బలపడుతోంది. ఇది రేపు వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

భారీత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం..వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలంగా మారుతోంది. ఇది ఉత్తరవైపుగా కదులుతోంది. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. అప్పటికి అది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాళ్ వద్ద ఉంటుంది. తర్వాత బెంగాళ్, ఒడిశా సరిహుద్దుల్లో తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి మరో 4 రోజులు కొనసాగుతుంది. ఈ పరిస్థితుల వల్ల తెలుగురాష్ట్రాల్లో ఈ వారం అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇవాళ కోస్తాంధ్రలో అత్యం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో 8,9 తేదీల్లో అతి భారీ వర్షాలు కురస్తాయి. 10వ తేదీ తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం..ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రపై ఎక్కువగా అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. నేడు కోస్తా, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలపై రోజంతా మేఘాలు ఉంటాయి. నేడు హైదరాబాద్ లో వర్షంపడే అవకాశం తక్కువగా ఉంది. అయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది. 

Tags:    

Similar News