బాసర ట్రిపుల్ ఐటీ సమస్యను త్వరగా పరిష్కారించే యోచనలో విద్యాశాఖ
*ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమావేశం
Basara IIIT Update: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యను త్వరగా పరిష్కారించే దిశగా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ లో విద్యార్థుల డిమాండ్స్ పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు ఇంకా పొడిగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే ట్రిపుల్ ఐటీకి సెలవులు ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది.
వారం రోజులుగా జరుగుతున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు పుల్ స్టాప్ పెట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులు ఆందోళన చేపట్టి వారం రోజులు గడుస్తుండటంతో పాటు విద్యార్థుల ఆందోళన కూడా రోజురోజుకు తీవ్రమవుతోంది. స్టూడెంట్స్ ఆందోళనకు పూర్వ విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీల మద్దతు కూడా పెరుగుతోంది. దీంతో అలెర్ట్ అయిన ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
నిన్న విద్యార్థులతో కలెక్టర్ తో జరిగిన రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు తగ్గేది లేదంటున్న విద్యార్థులు అధికారుల యాక్షన్ ప్లాన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ వీసీ, లెక్చరర్ల నియామకం పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.