Barrelakka: మరోసారి హైకోర్టుకు బర్రెలక్క..!
Barrelakka: మరో పిటిషన్ వేసేందుకు సిద్ధమైన శిరీష
Barrelakka: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీష మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు బర్రెలక్క. తక్షణమే ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పినా పోలీసులు స్పందించలేదని.. కోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదని మరో పిటిషన్ వేయాలని బర్రెలక్క న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీష, అలియాస్ బర్రెలక్క హైకోర్ట్‌ను ఆశ్రయించారు. తనను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వడం లేదని... తన భద్రత కావాలని కోరుతూ... ఇటీవల హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆమెకు భద్రత కల్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని, త్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకూ భద్రత కల్పించాలని కోర్టు అభిప్రాయపడింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.