Hyderabad: హాస్టల్ లో విషాదం.. టీచర్ ను పొడిచి చంపిన బార్బర్

Hyderabad: హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో దారుణ హత్య చోటు చేసుకుంది.

Update: 2024-07-28 05:32 GMT

Hyderabad: హాస్టల్ లో విషాదం.. టీచర్ ను పొడిచి చంపిన బార్బర్

Hyderabad: హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో దారుణ హత్య చోటు చేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్‌లో మర్డర్ జరిగింది. హెయిర్ కట్ షాప్‌లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు. గణేష్ రోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగింది.

వెంకటరమణపై గణేష్ కటింగ్ షాప్‌లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కర్నూల్‌ జిల్లా ఆలమూరు గ్రామ వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News