Bank Cashier: మలుపు తిరిగిన బరోడా బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ కేసు

Bank Cashier: హయత్ నగర్ మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయిన ప్రవీణ్

Update: 2022-05-17 03:00 GMT

Bank Cashier: మలుపు తిరిగిన బరోడా బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ కేసు

Bank Cashier: బ్యాంకు నిధులు గోల్ మాల్ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 23 లక్షల 53వేల రూపాయలతో ఉడాయించిన క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలను విడుదలచేస్తూ అజ్ఞాతం వీడి నేరుగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరు కావడంతో రెండు వారాలపాటు రిమాండుకు తరలించారు. బ్యాంకు అధికారుల బాధ్యతారాహిత్యాన్ని, భద్రతాలోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ప్రవీణ్ చేతులమీదుగా తేడావచ్చిన 23 లక్షల 53వేల రూపాయలు ఏమయ్యాయో అంతుబట్టకున్నాయి.

హైదరాబాద్ వనస్థలిపురంలో సంచలనం రేపిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులకు చిక్కకుండా మెజిస్ట్రేటు ఎదుట హాజరుకావడం గతంలో పంపిన వీడియో సందేశాలు చర్చనీయాంశమయ్యాయి.

ఈ నెల పదోతేదీన వనస్థలిపురం సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో 23 లక్షల 53వేలరూపాయల నగదుతో క్యాషియర్ ప్రవీణ్ కుమార్ అదృశ్యమయ్యాడు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటైన తాను నష్టపోయానని తల్లికి వీడియో సందేశం పంపాడు. కోల్పోయిన డబ్బులు బెట్టింగ్ ద్వారా గెలిస్తే ఇచ్చేస్తానంటూ వివరించాడు. నష్టపోతే ఆత్మహత్య చేసుకుంటామని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అదే రోజు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వనస్థలిపురంనుంచి చిట్యాల వెళ్లిన ప్రవీణ్ , బస్సులో బెంగళూరుకు వెళ్లి, సెల్ ఫోన్ సాయంతో సెల్ఫీ వీడియోలను పంపాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే వాస్తవాలు బయటకు రావనే ఉద్ధేశంతో కోర్టులో లొంగిపోయినట్లు తెలిపాడు. రెండు రోజుల తర్వాత రెండు వీడియోలను విడుదల చేసిన ప్రవీణ్ బ్యాంకులో పోయిన సొమ్ముతో తనకేం సంబంధంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. బ్యాంకు మేనేజర్ కావాలనే తనపై ఆరోపణలు చేస్తు్న్నాడని పేర్కొన్నాడు. ప్రవీణ్ కుమార్ ద్విచక్రవాహనాన్ని చిట్యాల బస్టాండు సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ధర్యాప్తు ముమ్మరంగా సాగుతున్ననేపథ్యంలో నాటకీయంగా హయత్ నగర్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు రెండు వారాలపాటు రిమాండుకు తరలించింది.

బ్యాంకు అవకతవకలపై క్యాషియర్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాంకులో నగదును భద్రపరచే చోట సీసీ కెమరాల్లేవని తెలిపాడు. తరచూ బ్యాంకు లెక్కల్లో తేడా వస్తొందని, గతంలోనూ లక్ష రూపాయలు తక్కువగా రావడంతో ఇంట్లోంచి ఆ డబ్బుల్ని సర్థినట్లు తెలిపాడు. ఈనెల 10 తేదీన నాలుగు లక్షలరూపాయలు తక్కువ రావడంతో అక్కడినుంచి వెళ్లిపోయానని తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులో గోల్‌మాల్‌పై పూర్తివివరాలను బయటపెడతానంటున్నాడు. రిమాండులో ఉన్న ప్రవీణ్‌ను కస్టడీకోరుతూ వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Full View


Tags:    

Similar News