Banjara Utsav 2021: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బంజారా ఉత్సవ్‌ కార్యక్రమం

* అధికారంలోకి వచ్చాక తండాల్లో సేవాలాల్‌ దేవాలయాన్ని నిర్మిస్తాం -బండి సంజయ్‌

Update: 2021-11-15 04:53 GMT

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బంజారా ఉత్సవ్‌ కార్యక్రమం(ఫైల్ ఫోటో)

Banjara Utsav 2021: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బంజారా ఉత్సవ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. గిరిజన బంధు, మూడు ఎకరాల భూమి, పది శాతం రిజర్వేషన్లు లాంటి పలు డిమాండ్లతో బంజారా ఉత్సవ్‌ కార్యక్రమం నిర్వహించారు.

అదేవిధంగా గిరిజన హక్కుల భాష, సాంస్కృతి అభివృద్ధిపై చర్చించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ తండాల్లో సేవాలాల్‌ దేవాలయాన్ని నిర్మిస్తామన్నారు. గిరిజనులను వేధిస్తున్న కేసీఆర్‌ కుటుంబాన్ని గద్దె దించుతామన్నారు.

దళితబంధు లాగే గిరిజనబంధు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. నవంబర్‌ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్‌ మాటలు ఒట్టి మాటలయ్యాయన్నారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికే కేసీఆర్‌ దొంగ స్కీంలను తీసుకొచ్చారని ఆరోపించారు. మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News