Bandi Sanjay: ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు..?
Bandi Sanjay: కేసీఆర్ పాలనలో మహిళలకు గౌరవం లేదన్నారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్.
Bandi Sanjay: కేసీఆర్ పాలనలో మహిళలకు గౌరవం లేదన్నారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్సీ కవిత డీజేలు, డిస్కోలతో బతుకమ్మ గౌరవం తీశారని... ఇప్పుడు లిక్కర్ దందాతో రాష్ట్రం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రాధాన్యమిస్తున్న మోదీ పాలనకు.. మహిళల్ని చిన్నచూపు చూస్తున్న కేసీఆర్ పాలనకు బేరీజు వేసుకోవాలని కోరారు బండి సంజయ్. ఈడీ నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు స్వచ్చందంగా పనిచేస్తాయి. లిక్కర్ స్కాం కేసులో నిందితులు నాకు తెలుసని గతంలో కవితే చెప్పారు. దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలి. ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు.