Bandi Sanjay: వరంగల్‌కు బండి సంజయ్ తరలింపు
Bandi Sanjay: వరంగల్ హైవేపై బీజేపీ నేతల ఆందోళనలు
Bandi Sanjay: బండి సంజయ్‌ను పోలీసులు వరంగల్‌కు తరలిస్తున్నారు. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర వరంగల్ పోలీసులకు హ్యాండోవర్ చేశారు. మరోవైపు వరంగల్ హైవేపై బీజేపీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెంబర్తి వద్ద బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.