Bandi Sanjay: కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనేంతగా యుద్ధం చేస్తామన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు.
Bandi Sanjay: కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కేటీఆర్ చేసిన అరాచకాలు.. అవినీతి అందరికి తెలుసన్నారు. నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి.. జైళ్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేరన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ చర్చలు అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ లో లుకలుకలు మొదలైయ్యాయన్నారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ లో జరగబోయేది యుద్దమే అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనేంతగా యుద్ధం చేస్తామన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇస్తూ తీర్పునిచ్చారన్నారు. ఐదేళ్లు అధికారన్ని ఉంచుకుంటారా వదులుకుంటారా అన్నది ప్రభుత్వ పనితీరుపై ఆధార పడి ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఇక కవిత బెయిల్‌తో బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్నారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదని బండి సంజయ్ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు.