ఆకాశంలో 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న బండారు విజయలక్ష్మి

ఈ రోజు జాతీయ జెండాను ప్రదర్శించడానికి ఇండిగో విమానంలో ఆకాశంలోకి వెళ్లారు. ఈ ఆలోచన రాగానే దానిని కార్యరూపం దాల్చేలా చేసి, అందుకు అమూల్యమైన సహకారం అందించిన రామ్మోహన్ నాయుడుగారికి మరియు ఇండిగో గ్రూప్‌కు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బండారు విజయ లక్ష్మీ పేర్కొన్నారు.

Update: 2024-08-15 09:00 GMT

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో అలయ్ బలై ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి గారు సగర్వంగా పాల్గొన్నారు.

జాతీయ జెండాను ప్రముఖంగా ప్రదర్శించేలా పౌరులను ప్రోత్సహిస్తూ తద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా 'హర్ ఘర్ తిరంగ'ను డిజైన్ చేశారు. దేశభక్తిని చాటుకునే ఈ కార్యక్రమంలో భాగంగా బండారు విజయ లక్ష్మీ గారు ఆమె టీం 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని 'హర్ జఘా తిరంగా'గా మార్చారు.

ఈ రోజు జాతీయ జెండాను ప్రదర్శించడానికి ఇండిగో విమానంలో ఆకాశంలోకి వెళ్లారు. ఈ ఆలోచన రాగానే దానిని కార్యరూపం దాల్చేలా చేసి, అందుకు అమూల్యమైన సహకారం అందించిన రామ్మోహన్ నాయుడుగారికి మరియు ఇండిగో గ్రూప్‌కు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బండారు విజయ లక్ష్మీ పేర్కొన్నారు.

Tags:    

Similar News